చైనాకు హృతిక్‌ చిత్రం

భారతీయ చిత్రాలకు చైనాలో మంచి డిమాండ్‌ ఉంది. మనదేశంలో విజయవంతమైన చిత్రాలే కాదు.. ఇక్కడ అంతగా ఆదరణ దక్కని చిత్రాలు కూడా అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో భారతీయ చిత్రం చైనాలో విడుదలవుతోంది. హృతిక్‌ రోషన్‌, యామీ గౌతమ్‌ జంటగా నటించారు. అంధులైన ఓ ప్రేమ జంట కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో హృతిక్‌, యామీ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. రాకేష్‌ రోషన్‌ నిర్మించిన ఈ చిత్రానికి సంజయ్‌గుప్తా దర్శకుడు. వచ్చే నెల 5న చైనాలో ఈ చిత్రం విడుదల కానుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.