కరోనా సమయంలోనూ జపాన్‌లో విడుదల కానున్న వార్‌

బాలీవుడ్‌ నటులు హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాప్‌ కలిసి నటించిన చిత్రం ‘వార్’‌. గత ఏడాది సిద్ధార్ధ్ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వాణీ కపూర్‌ కథానాయికగా నటించి అలరించింది. యష్‌రాజ్‌ ఫిల్మ్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా గత ఏడాది అక్టోబర్‌ 2న విడుదలై విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం జపాన్‌లో జులై 17న విడుదల కానుందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే జపాన్‌లో మే నెల్లోనే థియేటర్లును తిరిగి ప్రారంభించింది. ఈ మధ్యే టోక్యోలో హాలీవుడ్‌ పాత సినిమాలైన ‘బెనహర్’‌, ‘బోనీ అండ్‌ క్లెడ్’‌, ‘ది టవరింగ్‌ ఇన్ఫెరో’లను థియేటర్లో ప్రదర్శించారు. ఈ విధంగా చూస్తే కరోనా వైరస్‌ సమయంలో జపాన్‌ విడుదల అవుతన్న భారతీయ చిత్రం ‘వార్’‌ ప్రసిద్థి కెక్కనుంది. జపాన్‌లో హృతిక్‌, టైగర్‌ ష్రాఫ్‌లకి చాలామంది అభిమానులు ఉన్నారు. తాజాగా టోక్యోలోని డిస్నీల్యాండ్‌ - డిస్నీ సియాలు తిరిగి తెరుచుకున్నాయి. గత నాలుగు నెలలుగా కోవిడ్‌-19 కారణంగా ఈ సంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.