అవంతిక - ఇమ్రాన్‌లు విడిపోతున్నారా?

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌ తన భార్య అవంతికతో ఇక దాదాపుగా విడపోయినట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి. అమీర్‌ ఖాన్‌ మేనల్లుడైన ఇమ్రాన్‌, అవంతిక మాలిక్‌ను ఎనిమిది సంవత్సరాల కిందట పెళ్లి చేసుకొన్న సంగతి తెలసిందే. అయితే వీరిద్దరూ ఇప్పటికే విడివిడిగా ఉంటున్న సంగతి తెలసిందే. వీరికి నాలుగు సంవత్సరాలు కూతురు కూడా ఉంది. అవంతిక తన కూతురుతో కలిసి తల్లితోనే ఉంటుంది. అయితే విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ ఇద్దరు విడాకుల కోసం ఎటువంటి న్యాయసలహాలను తీసుకోలేదు. ఇదే విషయాన్ని కొంతమంది సినీ సన్నిహితులు భార్యభర్తలను అడగ్గా సమయం వచ్చినప్పుడు అన్నీ విషయాలు చెప్తామంటూ సమాధానమిచ్చారట. మొత్తం మీద వ్యవహారం వీధిన పడకుండా ఎవరు వారు విడిగా ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. 2015లో ఇమ్రాన్‌ ఖాన్‌ నిఖిల్‌ అడ్వాణి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘కట్టి బట్టి’ ఇందులో కంగనా రనౌత్‌ కథానాయికగా నటించింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.