‘జుద్వా3’లో కథానాయకుడు ఎవరు?

డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో యాక్షన్‌ కామెడీగా తెరకెక్కిన చిత్రం ‘జుద్వా’కి మరో సీక్వెల్‌ రాబోతోందా? అవుననే అంటున్నాయి చిత్రవర్గాలు. సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో కథానాయికలుగా రంభ, కరిష్మాకపూర్‌ నటించారు. ఆరున్నర కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇరవైమూడు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత ‘జుద్వా2’ కూడా వచ్చింది. ఇప్పుడు ‘జుద్వా3’ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ విషయంపై చిత్రనిర్మాత సాజిద్‌ నదియాద్‌వాలా మాట్లాడుతూ..‘‘ఇంకా హీరో ఎవరనేది నిర్ణయించలేదు. 1997లో వచ్చిన ‘జుద్వా’లో సల్మాన్‌ హీరోగా నటించగా, 2017లో తెరపైకి వచ్చిన ‘జుద్వా2’లో వరుణ్‌ ధావన్‌ నటించారు. కనుక ముచ్చటగా మూడోసారి వస్తున్న చిత్రంలో మరో కొత్త నటుడు నటించవచ్చునని’’ చెప్పాడు. ‘జుద్వా’ సినిమాకి మూలం ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 1994లో వచ్చిన ‘హలో బ్రదర్‌’ చిత్రం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.