తెలుగు నిర్మాతల హిందీ చిత్రం ‘జూలీ’

అలనాటి తెలుగు కథానాయికల్లో చెప్పుకోదగిన నటీమణి లక్ష్మి. తాజాగా ‘ఓ బేబీ’ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఆమె కెరీర్‌లో మరిచిపోలేని చిత్రం ‘జూలీ’. ‘భూల్‌ గయా సబ్‌ కుచ్‌’, ‘మై హార్ట్‌ ఈజ్‌ బీటింగ్‌’ లాంటి పాటలతో యువతను ఉర్రూతలూగించిన ఆ చిత్రం 1975 ఏప్రిల్‌ 18న విడుదలై సంచలన విజయం అందుకుంది. సరిగ్గా నలభై అయిదు సంవత్సరాల కిత్రం కె.ఎస్‌.సేతుమాధవన్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు నిర్మాతలు బి.నాగరెడ్డి-చక్రపాణిలు నిర్మించారు. విజయా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో శ్రీదేవి, జూలీ సోదరిగా నటించి మెప్పించింది. ఇంకా చిత్రంలో నదిరా, ఓమ్‌ ప్రకాశ్, ఉత్పల్‌ దత్, సులోచన, రాజేంద్రనాథ్‌ తదితరులు నటించారు. ఆనంద్‌ భక్షి రచించిన గీతాలకు రాజేష్‌ రోషన్‌ సంగీతం అందించగా, కిశోర్‌ కుమూర్, లతా మంగేష్కర్, ఆశోభోస్లే ఆలపించారు. ఇప్పటికీ బాలీవుడ్‌లో వస్తున్న ప్రేమకథా చిత్రాలకు ఎంతోకొంత స్ఫూర్తిగా ‘జూలీ’ చిత్రం నిలుస్తుందనడంలో సందేహం లేదు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.