‘కేసరి’ని దాటిన ‘కళంక్‌’

బాలీవుడ్‌ భారీ తారాగణంతో తెరపైకి వచ్చిన చిత్రం ‘కళంక్‌’. ఈ సినిమా తొలిరోజు వసూళ్లు చూస్తే 2019 సంవత్సరంలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఘనత సాధించింది. అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘కేసరి’ సినిమా తొలి రోజు వసూళ్లు 20కోట్లు కాగా, ‘కళంక్‌’ వసూళ్లు 22కోట్లకు చేరింది. వరుణ్‌ ధావన్, ఆలియాభట్, సోనాక్షి సిన్హా, మాధురి దీక్షిత్, సంజయ్‌దత్, ఆదిత్యరాయ్‌ కపూర్‌లాంటి చాలా మంది ఇందులో నటించారు. గతంలో నిర్మాత కరణ్‌ జోహార్‌ చెప్పినట్టు..‘‘ఇది మా తండ్రి కలలగన్న చిత్రం. 15 సంవత్సరాల క్రితం నా మనసులోని మొలిచిన కథ ఇది..’’అంటూ చెప్పారు. ఈ వసూళ్లను చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమా మంచి ఫలితాలను ఇస్తుందని కరణ్‌ జోహార్‌ సన్నిహితులు చెప్పుకుంటున్నారట. అభిషేక్‌ వర్మన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, నదియాద్‌ వాలా, ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ సినిమాకి ప్రీతమ్, సంచిత్‌ బల్హారా సంగీతం అందిస్తున్నారు.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.