కల్ప‌నతో సరి‌పె‌ట్టిన ఉద‌య‌శం‌కర్‌
article imageప్రఖ్యాత సితార్‌ విద్వాం‌సుడు పండిట్‌ రవి‌శం‌కర్‌ సోద‌రుడు ఉద‌య‌శం‌కర్‌ భార‌తీయ నృత్య‌క‌ళలో నిష్ణా‌తుడు.‌ లండ‌న్‌రా‌యల్‌ కాలే‌జీలో నాట్య‌క‌ళా‌భ్యాసం చేస్తుం‌డగా ‌‘కృష్ణ అండ్‌ రాధ’, ‌‘ఎ హిందూ వెడ్డింగ్‌’‌ అనే రెండు నృత్య గానా‌లను సృష్టించే అవ‌కాశం కలి‌గింది.‌ వాటిని కోవెంట్‌ గార్డ‌న్‌లో ప్రద‌ర్శిం‌చారు.‌ రష్యన్‌ బలే‌రినా అనా‌పా‌వ‌లోవా రాధగా నర్తి‌స్తుంటే ఉద‌య‌శం‌కర్‌ కృష్ణు‌డుగా నర్తిం‌చే‌వారు.‌ భార‌త్‌కు తిరిగి వచ్చాక ఒక మంచి నాట్య బృందాన్ని తయా‌రు‌చేసి యూరప్, అమె‌రికా దేశాల్లో ప్రద‌ర్శ‌నలు ఇచ్చారు.‌ కోల‌కత్తా నాట్య శిక్ష‌ణా‌శా‌లను నెల‌కొల్పి ఎంతో‌మంది నాట్య‌క‌ళా‌కా‌రు‌లను తయారు చేశారు.‌ ఉద‌య‌శం‌క‌ర్‌కు నాట్య‌క‌ళకు ఊపి‌రి‌లూదే ఒక చిత్రాన్ని నిర్మిం‌చా‌లనే ఊహ కలి‌గింది.‌ ఒక యువ నృత్య‌కా‌రు‌నికి డ్యాన్స్‌ అకా‌డమీ స్థాపిం‌చా‌లనే అభి‌లాష కలిగి, ఆ స్థాపనే ధ్యేయంగా నడిచే నేప‌థ్యంలో నిర్మిం‌చిన చిత్రం ‌‘కల్పన’‌.‌ ఇందులో ఉద‌య‌శం‌కర్‌ సర‌సన అతని భార్య అమ‌లా‌శం‌కర్‌ నటిం‌చింది.‌ విష్ణు‌దాస్‌ శిరాలి సంగీతం సమ‌కూ‌ర్చారు.‌ మద్రాసు జెమిని స్టూడి‌యోలో ఈ సినిమా నిర్మా‌ణా‌నికి సుదీ‌ర్ఘంగా నాలు‌గేళ్లు పట్టింది.‌ అద్భు‌త‌మైన సెట్టిం‌గు‌లతో అత్య‌ద్భుత నృత్య‌రీ‌తు‌లలో ఈ సినిమా నిర్మాణం జరి‌గింది.‌ జెమినీ స్టూడియో అధి‌నేత ఎస్‌.‌ఎస్‌.‌వాసన్‌ ఈ నృత్య‌ని‌ర్మాణ రీతు‌లకు అచ్చె‌రు‌వొంది తర్వాత రోజుల్లో ‌‘చంద్రలేఖ’‌ సినిమా నిర్మిం‌చారు.‌ కల్పన సినిమా నృత్య‌ప్రధా‌న‌మై‌నది కావ‌డంతో సగటు ప్రేక్ష‌కుడు ఎంత‌వ‌రకు ఆద‌రి‌స్తా‌డనే సంశయం చిత్రప‌రి‌శ్రమ పెద్ద‌లకు కలి‌గిన మాట వాస్తవం.‌ అయితే 1948లో ఈ చిత్రాన్ని కోల్‌క‌త్తాలో విడు‌దల చేసి‌న‌ప్పుడు అది ఏకంగా 26 వారాలు ఆడి రజ‌తో‌త్సవం చేసు‌కుంది.‌ కానీ, ఇతర కేంద్రా‌లలో ఈ సినిమా విజ‌య‌వంతం కాలేదు.‌ దానితో ఉద‌య‌శం‌కర్‌ నిస్ప¬ృ‌హ‌కు‌లోనై మరో సినిమా నిర్మించే ప్రయత్నం మాను‌కు‌న్నారు.‌ ఈ సినిమా ద్వారానే ప్రముఖ నటి, నర్తకి పద్మిని తన 17వ ఏట తెరం‌గేట్రం చేసింది.‌ భారత ప్రభుత్వం ఉద‌య‌శం‌క‌ర్‌ను ‌‘పద్మ‌వి‌భూ‌షణ్‌’‌ పుర‌స్కా‌రంతో సత్క‌రిం‌చింది.‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.