గోల్డ్‌తో మణి‌క‌ర్ణిక క్లాష్‌!
article imageఅతి తక్కువ వ్యవ‌ధిలో ‌‘గౌత‌మి‌పుత్ర శాత‌కర్ణి’‌ సిని‌మాను అత్య‌ద్భు‌తంగా మల‌చిన సంచ‌లన దర్శ‌కుడు క్రిష్, రాణి ఝాన్సీ లక్ష్మి‌బాయి జీవిత కథను తెర‌కె‌క్కి‌స్తున్న విషయం తెలి‌సిందే.‌ మొదట ఏప్రిల్‌ 27న ఈ సిని‌మాను ప్రపంచ వ్యాప్తంగా విడు‌దల చెయ్యా‌లని నిర్మా‌తలు కమ‌ల్‌జైన్, నిశాంత్‌ పిట్టి, ప్రక‌టిం‌చినా, అది చారి‌త్రా‌త్మక సినిమా కావ‌డంతో ఆగస్టు 15న స్వాతం‌త్య్ర‌దిన కాను‌కగా విడు‌దల చేస్తే అర్ధ‌వం‌తంగా ఉంటుం‌దని యోచి‌స్తు‌న్నారు.‌ అయితే ఫర్హాన్‌ అఖ్తర్, రితేస్‌ సిద్వా‌నిలు ‌‘గోల్డ్‌’‌ పేరుతో నిర్మి‌స్తున్న సిని‌మాను అదే రోజు విడు‌దల చేస్తు‌న్నట్లు ముందు‌గానే ప్రక‌టిం‌చారు.‌ ఇదే జరి‌గితే చారి‌త్రా‌త్మక చిత్రాలు క్లాష్‌ అవు‌తాయి.‌ అక్ష‌య్‌కు‌మార్, కునాల్‌ కపూ‌ర్‌లు నటి‌స్తున్న ‌‘గోల్డ్‌’‌ సినిమా 1948లో భారత హాకీ జట్టు ఒలిం‌పిక్‌ క్రీడల్లో బంగారు పత‌కాన్ని సాధిం‌చిన నేప‌థ్యంలో నిర్మి‌త‌మ‌వు‌తోంది.‌ అర్జున అవార్డు గ్రహీత సందీప్‌ సింగ్‌ ఈ సిని‌మాలో నటి‌స్తున్న నటు‌లకు హాకీ ఆట మెళ‌కు‌వలు నేర్చు‌కో‌వ‌డంలో శిక్షణ ఇస్తు‌న్నారు.‌ ఇక ‌‘మణి‌క‌ర్ణిక’‌ సినిమా విష‌యా‌ని‌కొస్తే, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రను పోషి‌స్తుం‌డగా, జిస్సు‌సేన్‌ గుప్తా, అంకితా లోఖాండే, అతుల్‌ కుల‌కర్ణి, సోనూ‌సూద్‌ ఇతర ముఖ్య పాత్రలు ధరి‌స్తు‌న్నారు.‌ బ్రిటీష్‌ వారి ఈస్ట్‌ ఇండియా కంపె‌నీతో రాణి ఝాన్సీ‌లక్ష్మి‌బాయి జరి‌పిన విరో‌చిత యుద్ధం ఈ సిని‌మాలో ప్రత్యేక ఆక‌ర్షణ.‌ అయితే సంజ‌య్‌లీలా భన్సాలి చిత్రం ‌‘పద్మా‌వత్‌’‌ మీద వచ్చిన వివా‌దమే, మణి‌క‌ర్ణిక సినిమా మీదకు కూడా వచ్చేలా ఉందని రాజ‌స్థా‌న్‌లో వదం‌తులు పుడు‌తు‌న్నాయి.‌ లక్ష్మి‌బాయి ఒక బ్రిటీష్‌ యువ‌కు‌నితో ప్రేమ వ్యవ‌హారం నడి‌పిం‌దని చరి‌త్రలో వక్రీ‌క‌రిం‌చా‌రని, ఆ విష‌యాన్ని ఈ సిని‌మాలో ప్రస్తా‌విం‌చ‌కుండా జాగ్రత్తలు తీసు‌కో‌వా‌లని సర్వ‌బ్రా‌హ్మణ సభ తీర్మానం చేసింది.‌ చూడాలి ఈ సినిమా కూడా వివా‌ద‌స్పదం అవు‌తుం‌దేమో!
article image


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.