విమానాశ్రయంలో డ్యాన్స్‌తో అదరగొట్టిన దీపిక

బాలీవుడ్‌లో ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో సరికొత్త ఛాలెంజ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలే ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్ర ప్రచారం కోసం అక్షయ్‌కుమార్‌ ‘బాలా ఛాలెంజ్‌’ను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. దీనికి నెట్టింట మంచి ఆదరణ దక్కింది. ఎంతో మంది సినీ ప్రముఖులు అక్కీ ఛాలెంజ్‌ను స్వీకరించి ‘‘బాలా..’’ గీతానికి తమదైన శైలిలో స్టెప్పులేసి అదరగొట్టారు. ఇప్పుడు దీన్ని స్ఫూర్తిగా తీసుకొనే బాలీవుడ్‌ యువ హీరో కార్తిక్‌ ఆర్యన్‌ సైతం తన కొత్త చిత్రం ‘పతీ పత్ని ఔర్‌ ఓ’ కోసం ‘‘ధీమే ధీమే.. ఛాలెంజ్‌’’ను తీసుకొచ్చారు. ఈ సవాల్‌ని స్వీకరించిన ఎవరైనా కార్తిక్‌ కొత్త చిత్రం నుంచి వచ్చిన ‘‘ధీమే ధీమే..’’ గీతానికి తమదైన శైలిలో స్టెప్పులు వేయాల్సి ఉంటుంది. తాజాగా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన దీపిక పదుకొణె ముంబయి విమానాశ్రయంలో కార్తిక్‌ ఆర్యన్‌తో కలిసి ఆ పాటకు స్టెప్పులేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. అంతేకాదు.. ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేయాల్సిందిగా తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌కు సవాల్‌ విసిరింది.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani) on

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani) on

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.