జపాన్‌లో ‘కేసరి’

వైవిధ్య నటుడు అక్షయ్‌ కుమార్‌ నటించిన చిత్రం ‘కేసరి’. ఇండియాలో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమా ఆగస్టు 16, 2019న జపాన్‌లో విడుదల కానుంది. ఇదే విషయాన్ని అక్షయ్‌ కుమార్‌ తన ట్విట్టర్లో తెలుపుతూ ‘‘బ్యాటిల్‌ ఆఫ్‌ సారగడి నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. పదివేల మంది శత్రుసైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న కేవలం 21 మంది వీరుల కథ. ఇది జపాన్‌ దేశంలో ఆగస్టులో విడుదల కానుందని..’’ పేర్కొన్నారు. 1897లో నాటి బ్రిటీష్‌ ఇండియాపై ఆఘ్గన్‌ తెగకు చెందిన పదివేల మంది శత్రుసైన్యం దండెత్తింది. వారిని కేవలం ఇరవై ఒక్కమంది భారతీయ బ్రిటీష్‌ వీరసైనికులు ఎదుర్కొన్నారు. వారి మధ్య జరిగిన పోరాటమే బ్యాటిల్‌ ఆఫ్‌ సారగడి. ఈ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, సునీర్‌ ఖేటర్పలు సంయుక్తంగా నిర్మించారు. అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన సినిమా మార్చి 21న ఇండియాలో విడుదలైంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.