ముఫ్పైరెండేళ్ల ‘ఖయామత్‌ సే ఖయామత్‌’ తక్‌’

‘‘పాపా కెహతే హైన్‌’’, ‘‘ఏ మేరే హమ్సఫర్‌’’, ‘‘గజబ్‌ కా హై దిన్‌’’అంటూ సాగే పాటలు వింటుంటే ఇప్పటికీ రొమాంటిక్‌గా ఉంటాయి. ఉదిత్‌ నారాయణ్, ఆల్కా యాగ్నిక్‌ల గొంతుల్లో వినిపించిన ఈ పాటలు ‘ఖయామత్‌ సే ఖయామాత్ తక్’చిత్రంలోనివి. అమీర్‌ ఖాన్, జుహీచావ్లా నాయికానాయకులుగా కలిసి నటించిన ఈ సినిమా ఏప్రిల్‌ 29, 1988లో విడుదలైంది. సరిగ్గా 32 సంవత్సరాల కిత్రం విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్‌లో వసూళ్ల వర్షం కురింపించింది. రొమాంటిక్ -విషాద సంగీత చిత్రంగా మన్సూర్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాతోనే అమీర్‌ ఖాన్‌ - జుహీచావ్లాలు అత్యంత ఆదరణపొందారు. రోమియో - జూలియట్‌ విషాద శృంగారంతో పాటు లైలా - మజ్నుల కథలు కూడా సినిమాకి నేపథ్యంగా తీసుకున్నారు. మజ్రూ సుల్తాన్‌పురి రాసిన గీతాలను, ఉదిత్‌ నారాయణ్‌ ఆలపించగా, ఆనంద్‌ - మిలింద్‌ల సంగీతం చిత్రానికే వన్నెతెచ్చాయని నాటి సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపించారు. నాసిర్‌‌ హుస్సేన్‌ ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమైన చిత్రంలో అలోక్‌ నాథ్, దలీప్‌ తహాల్, రీమా లాగు తదితరులు నటించారు. మొత్తం మీద సినిమాకి ఎనినిమిది ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులతో పాటు ఉత్తమ దర్శకుడిగా మన్సూర్‌ ఖాన్, ఉత్తమ నటీనటులుగా అమీర్‌ ఖాన్, జుహీచావ్లాకు అవార్డులు వచ్చాయి. ఈ నాటికి ‘ఖయామత్‌ సే ఖయామత్ తక్‌’ చిత్రం గురించి చర్చించుకుంటుంటారు. అన్నట్లు చిత్రానికి నిర్మాత, దర్శకుకుడిగా వ్యవహరించిన వారంతా అమీర్‌ ఖాన్‌కు చాలా దగ్గర బంధువులు అవ్వడం విశేషం.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.