ఏంటీ కియారా ‘గిల్టీ’

కియారా అడ్వాణీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కువగా చర్చించుకుంటున్న పేరు. ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంలోని తన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అంచనాలకు మించిన వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతుంది. ఈ విజయంతో బాలీవుడ్‌ స్టార్‌ కథానాయికల జాబితాలో చేరే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వెబ్‌ సిరీస్‌ చేయడంలో ముందు వరుసలో నిలుస్తుంది. గతంలో ‘లస్ట్‌ స్టోరీస్‌’ అనే వెబ్‌ ఫిలింలో నటించి సంచలనం రేకెత్తించింది. అప్పటి వరకు లేని గుర్తింపు పొందింది. కరణ్‌ జోహర్‌ నిర్మాణంలోనే మరోసారి ‘గిల్టీ’ అనే వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పింది. ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయగా అందరిని ఆకట్టుకుంటుంది. ఇందులోని పాత్రలో ఎలా మెప్పిస్తుందో చూడాలి. రుచి నారాయణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచమైందీ నటి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.