అధికారికంగా విడాకులు తీసుకున్న కొంకణా సేన్‌ - రన్వీర్‌ షోరే

బాలీవుడ్‌ నటులు కొంకణా సేన్‌ శర్మ - రన్వీర్‌ శౌరీ అధికారికంగా విడాకులు తీసుకున్నారు. 2015 నుంచి విడివిడిగా వుంటూ ఎవరి వారే విడిగా జీవిస్తున్నారు. కొంకణా - రన్వీర్‌ శౌరీలు 2007 డేటింగ్‌లో ఉన్నారు. ఆ తరువాత ఈ జంట 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011న ఒక బాబు పుట్టారు. పేరు హారూన్ శౌరీ. అయితే ఇద్దరి మధ్య బేధాబిప్రాయాలు రావడంతో 2015 నుంచి విడిపోతున్నారు ప్రకటించారు. అంతేకాదు కోర్టులోనూ విడాకుల పత్రాలు దాఖలు చేశారు. అయినా సరే ఇప్పటికీ స్నేహితులుగానే కొనసాగుతూ కుమారుడు హారూన్‌ కోసం రాకపోకలు కొనసాగిస్తున్నారు. కొంకణా సేన్‌ అంధేరిలోని అపార్ట్‌మెంట్‌లో ఉండగా, రన్వీర్‌ మలాడ్‌ ప్రాంతంలో ఉంటున్నారు. ఇద్దరిని కలిపి ఉంచడానికి వారి సన్నిహితులు చాలా ప్రయత్నాలే చేశారట. కానీ అవి ఫలించలేదని చెబుతున్నారు. చివరకు ఆగస్టు 13, 2020న అధికారికంగా విడాకలు పొందారు. కొంకణా సేన్‌ ప్రస్తుతం అలకింత శ్రీవాత్సవ దర్శకత్వంలో ‘డాలీ కిట్టి  ఔర్‌ వో చమక్తే సీతారే’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో భూమి ఫేడ్నేకర్‌ కిట్టి పాత్రలో అలరిస్తోంది. ఇక రన్వీర్‌ శౌరీ ఈ ఏడాదిలో లూట్‌కేసు చిత్రంలో మాధ‍వ్ కోట్లే పాత్రలో నటించి మెప్పించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.