వారణాసిలో ప్రేమపక్షులు

బాలీవుడ్‌ ప్రేమజంట అలియాభట్, రణ్‌బీర్‌ కపూర్‌లు ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనపడుతున్నారు. రణ్‌బీర్, అలియాలు వారణాసిలో కొలువైన కాశీనాథుని సందర్శంచిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగవైరలవుతున్నాయి. అసలు ఈ ప్రేమజంట వారణాసి ఎందుకొచ్చారు అనే చర్చ మొదలైందట. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త’. సినిమా బాగా రావాలని కోరుకునేందుకు స్వామివారిని సందర్శించామని అలియా - రణ్‌బీర్‌లు చెప్తున్నారట. అయితే కొంతమంది మాత్రం అలా అనుకోవడం లేదట. వీరి మనసులో ఇంకేదో పెట్టుకునే వారణాసి వచ్చి ఉంటారని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఆయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త’ సినిమా షూటింగ్‌ దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరపుకుంది. అందులో వారణాసి కూడా ఒకటి. తొలుత ఈ సినిమా 2019 డిసెంబర్‌లోనే తెరపైకి వస్తుందని ప్రకటించారు. కానీ కొన్ని గ్రాఫిక్స్, సాంకేతిక పనులు పూర్తికాక పోవడంతో 2020కి వాయిదా పడినట్లు చిత్రబృందం తెలిపింది.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.