సల్మాన్‌ మళ్లీ రీమేక్‌ కోసమేనా

మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన సినిమా ‘మహర్షి’. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకొంది. ఇప్పుడీ సినిమా గురించి ఓ ఆసక్తి కరమైన సమాచారం తెలిసింది. నృత్య దర్శకుడు ప్రభుదేవా, సల్మాన్‌లు ‘మహర్షి’ని ముంబయిలో వీక్షించబోతున్నారని చిత్రవర్గాల్లో చర్చ జరుగుతోంది. కథాంశం నచ్చితే సల్మాన్‌ ఈ సినిమా రీమేక్‌ హక్కులు కొంటారని సమాచారం. గతంలో సల్మాన్‌ ‘పోకిరి’ సినిమాను ‘వాంటెడ్‌’ పేరుతో హిందీలో విడుదల చేశారు. అక్కడ కూడా విజయవంతమై లాభాలను తెచ్చిపెటింది. దీంతో సల్మాన్‌కు మహేష్‌ నటించే సినిమాలంటే ఇష్టం ఏర్పడిందట. అందుకే ఆయన సినిమాలను ఆసక్తిగా గమనిస్తున్నారట. ఇప్పుడీ సినిమాను కూడా అందుకోసమే చూస్తునారనే ప్రచారం సాగుతోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.