చరిత్ర మర‌చిన మెహ‌తాబ్‌
article imageకొత్త నీరొచ్చి పాత‌నీ‌రును కొట్టు‌కు‌పో‌యి‌నట్టు కాలం గడి‌చే‌కొద్దీ ఎందరో మహా‌ను‌భా‌వు‌లైన కళా‌కా‌రు‌లను చరిత్ర మరు‌గున పడేస్తూ వస్తోంది.‌ దేశం‌లోనే అతి‌పె‌ద్ద‌దైన చిత్ర పరి‌శ్రమగా గుర్తించే బాలీ‌వు‌డ్‌లో ఇలాం‌టివి మామూలే అను‌కో‌వాలి.‌ అలాంటి చరిత్ర ఆణి‌ముత్యం మెహ‌తాబ్‌.‌ మూకీ సిని‌మా‌లతో నట‌జీ‌వితం ప్రారం‌భిం‌చిన మెహ‌తాబ్‌ అసలు పేరు నజ్మా.‌ ఆమె తండ్రి గుజ‌రా‌త్‌లోని సచిన్‌ నవా‌బ్‌గా సుప‌రి‌చి‌తుడు.‌ ఆమె నటిం‌చిన తొలి టాకీ ఇండి‌యన్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ వారు నిర్మిం‌చిన వీర్‌ కునాల్‌ (1932).‌ అందులో హీరోగా నటిం‌చిన అష్రఫ్‌ఖా‌న్‌నే ఆమె ప్రేమించి పెళ్లి‌చే‌సు‌కుంది.‌ ముఫై¬్ప దశ‌కంలో ఆమె నటిం‌చిన సిని‌మాలు పెద్దగా ఆడ‌లేదు.‌ అయితే 1941లో ఆమె కథా‌నా‌యి‌కగా నటిం‌చిన కేదా‌ర్‌శర్మ చిత్రం ‌‘చిత్రలేఖ’‌లో స్నాన‌ఘట్టం సన్ని‌వే‌శంలో అర్ధ‌న‌గ్నంగా నటిం‌చిన సంచ‌లనం సృష్టిం‌చింది.‌ ఆ సినిమా అత్య‌ధిక వసూ‌ళ్లును మూట కట్టు‌కుంది.‌ ఈ చిత్రం‌లోనే భర‌త్‌భూ‌షణ్‌ బాలీ‌వుడ్‌ రంగ‌ప్రవేశం చేశాడు.‌ ప్రముఖ గాయని సురయ్యా ఈమె సిని‌మా‌లకు పాటలు పాడేది.‌ కర్దార్‌ నిర్మిం‌చిన ‌‘శారద’, ‌‘కానూన్‌’‌ సిని‌మాల్లో హీరో‌యిన్‌ పాత్రలు పోషి‌స్తుం‌డగా సోహ్రాబ్‌ మోడీ సెంట్రల్‌ స్టూడియో వారు నిర్మి‌స్తున్న ‌‘పరఖ్‌’‌ సిని‌మాకి ఆమెను ఎంపిక చేశారు.‌ అప్ప‌టికే మెహ‌తాబ్‌ ఒక బిడ్డకు జన్మ‌నిచ్చి, ఆష్రఫ్‌ఖా‌న్‌తో మన‌స్ప‌ర్ధల కార‌ణంగా విడా‌కులు తీసు‌కుంది.‌ ‌‘పరఖ్‌’‌ సినిమా పుణ్యమా అని సోహ్రాబ్‌ మోడీకె మెహ‌తాబ్‌ దగ్గ‌ర‌యింది.‌ ఆ సిని‌మాలో నట‌నకు మెహ‌తాబ్‌ ఉత్తమ కథా‌నా‌యిక బహు‌మతి కూడా అందు‌కుంది.‌ తర్వాత వర‌సగా ఇస్మత్, ఏక్‌ దిన్‌ కా సుల్తాన్, సాథి, షమా వంటి సిని‌మా‌లలో నటిం‌చాక మోడీని వివాహం చేసు‌కుంది.‌ వీరి‌ద్ద‌రికీ వయ‌సులో ఇరవై ఏళ్ల తేడా ఉంది.‌ మోడీ మెహ‌తా‌బ్‌తో నిర్మిం‌చిన ‌‘ఝాన్సి కి రాణి’‌ సినిమా గొప్పగా ఆడ‌లేదు.‌ ఇద్దరూ పదేళ్ల తేడాలో చని‌పో‌వడం దుర‌దృ‌ష్ట‌మనే చెప్పాలి.‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.