బాలీవుడ్‌ ప్రేమకథ కథ మొఘల్-ఏ-ఆజం

మొఘల్ రాకుమారుడు సలీం, అనార్కలిల ప్రేమకథ ఆధారంగా కె. ఆసిఫ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మొఘల్-ఏ-ఆజం’. దిలీప్ కుమార్‌ నటజీవితంలో గొప్ప మైలురాయి. ఆగస్టు 5, 1960 విడుదలైన ఈ సినిమా కలక్షన్ల రికార్డు 15 సంవత్సరాల దాకా బ్రేక్ కాలేదంటే అది ఎంతటి బ్లాక్ బస్టర్ సినిమానో ఊహించుకోవచ్చు. ఈ సినిమా నిర్మాణానికి ఆ రోజుల్లోనే కోటిన్నర రూపాయలు ఖర్చయిందట. ఆ సినిమాలో అసలుసిసలైన బంగారు ఆభరణాలు వాడారు. 500 రోజులు శ్రమించి తీసిన ఈ సినిమా జాతీయ బహుమతినే కాకుండా మూడు ఫిలింఫేర్ బహుమతులనుకూడా గెలుచుకొంది. ఈ సినిమాను 2004లో డిజిటల్ టెక్నాలజీ సహకారంతో రంగులద్ది విడుదలచేస్తే, బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. ఇందులో నాయికగా నటించిన మధుబాలతో దిలీప్ ప్రేమాయణం సాగింది. అదొక విఫలమైన పెద్ద ‘రొమాంటిక్ టేల్’. మొఘల్ సుల్తాన్ అక్బర్‌గా పృథ్వీరాజ్ కపూర్‌, ఆయన తనయుడు సలీమ్‌గా దిలీప్ కుమార్, అనార్కలీ పాత్రలో మధుబాల మధ్య ఈ చిత్రకథ నడుస్తుంది. చారిత్రక చిత్రాన్ని ప్రేమకథా చిత్రంగా మలచారు. అనేక చారిత్రక విషయాలు సత్యదూరాలే. కానీ, ఈ చిత్రంలో వాడిన భాషా, సాహిత్యం అలరిచిందని చెప్పవచ్చు. ఇక నౌషాద్ సంగీతం సమకూర్చగా, లతా మంగేష్కర్, షంషాద్ బేగం, ముహమ్మద్ రఫీలు పాడిన పాటలు ఇప్పటికీ నిత్యనూతనమే.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.