
ప్రముఖ అంతర్జాతీయ టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వార్షిక వేడుకకు బ్రాండ్ అండాసీడర్లు బాలీవుడ్ నుంచి నటి ప్రియాంక చోప్రా దర్శకుడు అనురాగ్ కశ్యప్ చోటుదక్కించుకున్నారు. టిఫ్ 45వ వార్షిక వేడుకకు 50 మంది ప్రముఖులతో ఈ ఏడాది వేడుకను వర్చువల్‌గా జరపనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 19 వరకు ఈ వేడుకలు జరుగుతాయి. కరోనా వైరస్ కారణంగా డిజిటల్ స్క్రీనింగ్ వర్చువల్‌గా జరిగే ఈ కార్యక్రమంలో ఆస్కార్ విజేతలైన నటీనటులు-నిర్మాతలైన మార్టిన్ స్కోర్కెస్, అల్సోన్నో క్యూరాన్, తైకాతో, రియాన్ జాడ్సన్, నటులు నికోల్ కిడ్మన్, నాడిన్ లాబాకి, రీజ్ అహ్మద్, ఇసాబెల్లా హప్సుర్ట్ ఉంటారని నిర్వాహకులు ప్రకటించారు. వేడుకల్లోని మొదటి 5రోజుల్లో 50 సినిమాలను సామాజిక దూరం పాటిస్తూ.. దూరప్రదర్శనల ద్వారా ప్రదర్శించాలని చూస్తున్నారట. చరిత్రలో టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా జరుపుకోవడం తొలిసారి జరగనుంది. ఈ డిజిటల్ ప్రదర్శనల ద్వారా అందరు కలుసుకుని చేసుకొనే వేడుకకంటే ఇప్పుడు ఎక్కువమంది ప్రేక్షకులతో డిజిటల్‌గా కలువచ్చునని భావిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల వస్తాయని ఎప్పుడూ ఊహించలేదని నిర్వాహకులు టిఫ్ (టిఐఎఫ్ఎఫ్) కార్యనిర్వాహక కార్యదర్శి జోనా విసెంటే చెబుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి వల్ల కేన్స్, ట్రిబెకాలాంటి ఎన్నో చలనచిత్రోత్సవాలతో పాటు మరెన్నో అంతర్జాతీయంగా జరగాల్సిన సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. 1976లో ప్రారంభమైన ఈ వేడుక మార్గదర్శకాలను అనుసరించి, పరిస్థితులకు అనుగుణంగా ప్రేక్షకుల విశ్వనీయత, అభిరుచికి కలిసి పనిచేస్తామని నిర్వాహక కమిటి చెబుతోంది.
