బాలీవుడ్‌ నటుడు రంజిత్‌ చౌదరి కన్నుమూత!

వెండితెర-బుల్లితెర నటుడు రంజిత్‌ పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చే చిత్రాలు ‘ఖట్టా మీటా’, ‘ఖుబ్‌సూరత్‌’లాంటి చిత్రాలు గుర్తుకొస్తాయి. అలాంటి రంజిత్‌ చౌదరి తన 64 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో ఏప్రిల్‌ 14న చేరి చికిత్స పొందుతుండగా ఏప్రిల్‌ 15న మరణించారు. ఈయన ప్రముఖ థియేటర్‌ నటి అయినా పెరల్‌ పదమ్‌సీ కుమారుడు. ప్రముఖ యాడ్‌గురు అలీక్‌ పదమ్‌సీ రంజిత్‌కి స్టెప్‌ఫాదర్‌ అవుతారు. సెప్టెంబర్‌ 19, 1955లో జన్మించిన రంజీత్‌ చౌదరి ‘ఖట్టామీటా’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశాడు. హిందీలో చాలా చిత్రాల్లో సహాయక నటుడిగా నటించారు. ఈయనకు ఒక భార్య, పదహారేళ్ల కుమారుడు ఉన్నారు. వీరంతా న్యూయార్కులో ఉంటున్నట్లు రంజిత్‌ దగ్గర స్నేహితుడొకరు తెలిపారు. ఈయన దంత చికిత్స కోసం గత ఏడాది డిసెంబర్‌లో ఇండియా వచ్చారట. లాక్‌డౌన్‌ కారణంగా ఇండియాలో ఉండాల్సి వచ్చిందని కూడా ఆయర చెప్పాడు. ప్రముఖ దర్శకులురాలు దీపా మెహతా దర్శకనిర్మాణంలో వచ్చిన ‘బాలీవుడ్‌-హాలీవుడ్‌’ చిత్రంలో ‘రాకీ’ పాత్రంలో అలరించాడు. ఈ చిత్రం ఇంగ్లీషు, హిందీలో తీశారు. ఇంకా దీపా తీసిన ‘ఫైర్‌’,లోను నటించారు. అంతేకాదు ‘బండీట్‌ క్వీన్‌’, ‘కామసూత్ర: ఏ టేల్‌ ఆఫ్‌ లవ్‌’, ‘కింగ్‌’ ఆఫ్‌ జంగిల్‌’లాంటి చిత్రాల్లోను తనదైన ముద్రవేశారు. రంజిత్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.