రాజ్‌కపూర్‌ కుమార్తె మృతి

అలనాటి బాలీవుడ్‌ దివంగత నటుడు రాజ్‌ కపూర్‌ పెద్ద కూమార్తె రీతూ నందు మరణించారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న నందా మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. రీతూ నందాకు రణధీర్‌ కపూర్, రిషి కపూర్, రాజీవ్‌ కపూర్‌ సోదరులు. అలనాటి నటుడు రాజ్‌ కపూర్, కృష్ణకపూర్ల్‌కు రీతా కపూర్‌ అక్టోబర్‌ 30, 1948న జన్మించారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన రాజన్‌ నందాను 1969లో పెళ్లి చేసుకున్నారు. ఇక బాలీవుడ్‌ నటుడు అబితాబ్‌ బచ్చన్‌ కూతురు శ్వేతా బచ్చన్, నందా కుమారుడైన నిఖిల్‌ నందాను వివాహం చేసుకున్నారు. అందుకే కపూర్, బచ్చన్‌ కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. బాలీవుడ్‌ నటులు రణ్‌బీర్‌ కపూర్, కరిష్మా కపూర్, కరీనా కపూర్‌లకు రీతూ నందా స్వయాన మేనత్త అవుతుంది.


View this post on Instagram

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

View this post on Instagram

My dearest may your soul Rest In Peace ??????

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.