పెళ్లి వద్దట.. సహజీవనమే ముద్దట!!

‘‘పెళ్లి చేసుకోవడమంటే చచ్చిపోవడమే’’ అంటున్నారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌. ఐదు పదుల వయసులోకి వచ్చినా నేటికీ పెళ్లికీ దూరంగా ఉంటూనే వస్తున్నారు కండల వీరుడు. దీంతో బాలీవుడ్‌లో ఎప్పుడు పెళ్లిళ్ల టాపిక్‌ వచ్చినా.. అందరి దృష్టి తొలుత ఈ మోస్ట్‌ వాంటెడ్‌ సీనియర్‌ బ్యాచిలర్‌ పైనే పడుతుంటుంది. ఆయన ఏ ఇంటర్వ్యూకు హాజరైనా పెళ్లికి సంబంధించిన ప్రశ్న తరచూ ఎదురవుతూనే ఉంటుంది. అయితే తాజాగా పెళ్లి గురించి ఓ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు సల్మాన్‌. ‘మీరు పెళ్లి చేసుకుంటారా? ఎప్పటికీ ఇలా బ్యాచిలర్‌గగానే ఉండిపోతారా?’ అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. దానికి సల్లూ భాయ్‌ మతిపోయేలా సమాధానమిచ్చారు. ‘‘నా దృష్టిలో పెళ్లి చేసుకోవడమంటే చచ్చిపోవడంతో సమానం. అందుకే నాకు ఈ పెళ్లి అనే వ్యవహారంపైనే నమ్మకం లేదు. ప్రస్తుతం ఇదొక చచ్చిపోతున్న సంస్థ. వివాహం చేసుకోవడం కన్నా సహజీవనం చేయడం మేలు అనిపిస్తుంటుంది’’ అంటూ షాకింగ్‌ జావాబిచ్చారు సల్మాన్‌. దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు కాస్తా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కండల వీరుడు చెప్పిన దాన్ని బట్టీ చూస్తుంటే ఆయన ఎప్పటికీ పెళ్లి చేసుకోడనే విషయం స్పష్టమైపోతుంది. ఇక సహజీవనం మేలంటూ సల్లూ చెప్పడాన్ని బట్టీ.. ప్రస్తుతం ఆయన కత్రినాతో డేటింగ్‌ కొనసాగిస్తున్నాడేమో అంటూ బాలీవుడ్‌లో గుసగుసలు మొదలయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ జంటగా నటించిన ‘భారత్‌’ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. దీనికి అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించారు. 



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.