‘బైజు బావ్రా’లో రణ్‌బీర్‌ - దీపికా?

ప్రస్తుతం యావత్‌ ప్రపంచమంతా కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌కి వెళ్లిపోయింది. అందుకు చిత్రసీమ కూడా అతీతం కాదు. అయినా సరే లాక్‌డౌన్‌ పూర్తికాగానే కొత్త చిత్రాలను తెరకెక్కించేందుకు నటీనటులు, దర్శకులు వీడియో మాధ్యమాల ద్వారా చర్చలు జరుపుతున్నారు. బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ, 1952 నాటి సంగీత నాటక చిత్రం ‘బైజు బావ్రా’ను రీమేక్‌ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇందుకోసం ఏకంగా రణ్‌బీర్‌ కపూర్, దీపికా పదుకొణెలతో చర్చలు కూడా జరిపారట. అయితే అధికారికంగా వారిద్దరు ఎటువంటి నిర్ణయాలు బయటకు వెల్లడించలేదు. గతంలో  రణ్‌బీర్‌, దీపికలు కలిసి నటించిన ‘బచ్నా ఏ హసీనో’, ‘ఏ జవానీ హై దివానీ’ మంచి విజయాల్నే నమోదు చేశాయి. సంజయ్ ఇప్పటికే ‘బైజు బావ్రా’లో రణ్‌బీర్‌కపూర్‌ - దీపికా పదుకొణెలతోనే తెరకెక్కించాలని గట్టి పట్టుదలతో ఉన్నారట. ప్రస్తుతం సంజయ్‌ ‘గంగూబాయి కతియావాడి’ చిత్రాన్ని తెరక్కిస్తున్నారు. ఇందులో కథానాయికగా అలియా భట్‌ నటిస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా చిత్రానికి అనుకోని అవాంతరాలు ఎదురౌతున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.