అమర వీరులకు బాలీవుడ్‌ నివాళి

పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానులకు నివాళి అర్పించేందుకు బాలీవుడ్‌ ప్రముఖులు ఒక్కటయ్యారు. అమరవీరుల పోరాట స్ఫూర్తిని మననం చేసుకుంటూ రూపొందించిన ఓ ప్రత్యేక వీడియో గీతంలో వారుభాగస్వాములుఅయ్యారు. ‘తు దేశ్‌ మేరా..’ అంటూ సాగే ఈ వీడియోలో ప్రముఖ నటులు అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ ఖాన్‌, ఆమీర్‌ ఖాన్‌, ఐశ్వర్యరాయ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, టైగర్‌ ష్రాఫ్‌, కార్తిక్‌ ఆర్యన్‌ కనిపించి అమరవీరులకు జోహారులు అర్పించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ గీతాన్ని విడుదల చేశారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.