సన్నీకి కవల పిల్లలు
article image
బాలీవుడ్‌ నటి సన్నీలియోని, డేనియల్‌ వెబర్‌ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. గత ఏడాది అనాథ శరణాలయం నుంచి నిషా అనే చిన్నారిని దత్తత తీసుకొన్నారు సన్నీ దంపతులు. ఇప్పుడు సరోగసీ (అద్దె గర్భం) పద్ధతి ద్వారా కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకొంది సన్నీ. ‘ఇదంతా దేవుడి ప్రణాళిక. 2017 జూన్‌ 21నే తక్కువ వయసులోనే డేనియల్‌, నేను ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులవుదాం అనుకున్నాం. ఇప్పుడు మా జీవితంలోకి నిషా కౌర్‌ వెబర్‌తో పాటు కొత్తగా ఆషేర్‌ సింగ్‌ వెబర్‌, నోవా సింగ్‌ వెబర్‌ వచ్చారు. కొన్ని వారాల క్రితమే ఈ ఇద్దరూ పుట్టారు. భగవంతుడు మాకు ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకే ఇలా ముగ్గురు పిల్లలను ఇచ్చాడు’’అని ట్విట్టర్‌లో తన ఆనందాన్ని పంచుకొంది సన్నీ.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.