డిసెంబర్‌లోనే వరుణ్‌ - నటషాల పెళ్లి!

‘కళంక్‌’ నటుడు వరుణ్‌ ధావన్‌ తన చిన్ననాటి స్నేహితురాలు నటషా దలాల్‌ను పెళ్లి చేసుకోనున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి వరుణ్‌ - నటషాలు ప్రేమించుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ మధ్య వరుణ్‌ ఏప్రిల్‌ 24, తన పుట్టిన రోజున పెళ్లి చేసుకొనే విషయాన్ని ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో, ధావన్‌ - నటషా ఒకటిగా ఉంటారా లేదా అనే అనుమానం మొదలైంది బాలీవుడ్‌ చిత్రసీమలో. కానీ ఇలాంటి వార్తలన్నింటిని పక్కన పెట్టి ఈ సంవత్సరం డిసెంబర్‌లోనే వరుణ్‌ - నటషాలు ఒకటి కానున్నారని తాజా సమాచారం. పెళ్లికి ఇరువురి బంధుమిత్రులు, మిగతా రంగాలకు చెందిన అతి కొద్దిమంది మాత్రమే పెళ్లికి ఆహ్వానిస్తున్నారట. పెళ్లి వేదికగా సుందరమైన గోవా సముద్రతీరాన్ని ఎంచుకున్నారట. పెళ్లైయిన మరుక్షణమే తిరిగి ప్రత్యేక విమానంలో ముంబై చేరుకొని అక్కడే రిసెప్షెన్‌ కార్యక్రమం ఏర్పాట్లు చేయనున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విశేషం ఏమిటంటే గత ఏడాది డిసెంబర్‌లోనే బాలీవుడ్‌ నటీనటులు పెళ్లిళ్లు చేసుకొన్నారు. వారిలో సోనమ్‌ కపూర్‌ - ఆనంద్‌ అహుజా, ప్రియాంక చోప్రా - నిక్‌ జోనాస్, దీపికా పదుకొణె - రన్వీర్‌ సింగ్‌.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.