వేసవిలోనే వరుణ్‌, నటాషాల పెళ్లి!

బాలీవుడ్‌ ప్రేమజంట వరుణ్‌ ధావన్‌ - నటాషా దలాల్‌ పెళ్లి గురించి గత కొంతకాలంగా ఎన్నో వార్తలు హల్‌చల్‌ చేశాయి. తాజాగా ఈ ప్రేమజంట పెళ్లి మే 22న థాయ్‌ల్యాండ్‌ జరగనుంది సమాచారం. థాయ్‌లోని జెడబ్య్లూ మారియట్‌ ఖావో లక్‌ రిసార్ట్ అండ్‌ స్పాలో ఈ వేడుక జరనుందట. నటాషా ఇప్పటికే పెళ్లి గురించి తనకు కావాలస్సిన షాపింగ్‌ మొదలుపెట్టిందట. చిన్ననాటి ఈ స్నేహితులుగా ఉన్న వరుణ్‌ - నటాషాలు భార్యాభర్తలు కాబోతుండడంతో ఇరువురి సన్నిహితులు సంబరాలు చేసుకొంటున్నారట. వరుణ్‌ ఇప్పటికే ఓ కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేశాడు. ప్రస్తుతం వరుణ్‌ కూలీ నెం.1 అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయికగా సారా అలీఖాన్‌ నటిస్తుంది. చిత్రం మే 1, 2020న ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే మరో వైపు వీరి పెళ్లి వేదిక గురించి ఆందోళన కూడా మొదలైంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ భయపెడుతుంది. ముఖ్యంగా చైనాలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంది. దాంతో ఈ మధ్య థాయ్‌ల్యాండ్‌లో జరగవలసిన కొన్ని షూటింగ్‌లను కూడా వాయిదా వేసుకొన్నారు. ఆ విధంగా చూస్తే పెళ్లి వేడుక స్థలం మారే అవకాశం కూడా ఉందని బాలీవుడ్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.