వీళ్ల పెళ్లి వచ్చే ఏడాదిలోనా!

బాలీవుడ్‌ ప్రేమజంటల పెళ్లిళ్ల వేడుకకు కోరానా అడ్డమై ఇబ్బంది పెడుతోంది. బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ధావన్‌ తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌తో చాలాకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరుకుటుంబాలు ఈ ఏడాదిలోనే ఇద్దరిని ఒకింటివాళ్లను చేయడానికి నిర్ణయించుకున్నాయి. అయితే అనుకోకుండా కరోనా వైరస్‌ రావడంతో వ్యవహారమంతా అడ్డం తిరిగింది. ప్రస్తుతం కోరాన ఉధృతిని చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అందుకే వచ్చే ఏడాదిలోనే వరుణ్‌ధావన్‌ నటాషా దలాల్‌ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు వరుణ్‌ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎప్పటినుంచో ప్రేమలో మునిగితేలుతున్న మరో ప్రేమజంట రణ్‌బీర్‌ కపూర్‌ - అలియాభట్‌. వీరి వివాహం కూడా ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లిపీటల మీదికి వస్తారని అనుకున్నారు. కానీ రిషి కపూర్‌ మరణం ఆ ప్రణాళికలన్నింటిని తారుమారు చేసింది. ఇప్పటి వరకు వీరిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకోలేదు. మరోపక్క అలియా భట్, రణ్‌బీర్‌ కపూర్‌ పూర్తి చేయాల్సిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇలా ఎటుచూసినా అలియా - రణ్‌బీర్‌ కపూర్ల పెళ్లి గురించి వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు ఎలాంటి నిర్ణయాలు ఉండవని చెప్పుకుంటున్నారు. రణ్‌బీర్‌ ప్రస్తుతం ‘షమ్‌షేరా’ చిత్రం చేస్తున్నాడు. ఇక అలియా భట్‌ చేతిలో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘గంగూబాయి కతియావాడి’, ‘సడక్2’లాంటి చేయాల్సిన చిత్రాలు వున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.