నెట్టింట వివాదంగా వివేక్‌ ట్వీట్‌

దేశంలో ఓట్ల సమరం ముగిసింది. ఇక ఇప్పుడందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే. ఏ పార్టీ అధికార పీఠం దక్కించుకోబోతుందన్న దానిపై ఇప్పటికే వివిధ మీడియా సంస్థలు సర్వే ఫలితాలను కూడా విడుదల చేసేశాయి. ప్రస్తుతం ఈ ఎగ్జిట్‌ పోల్స్‌పై హాట్‌ హాట్‌గా చర్చలు సాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఎగ్జిట్‌ ఫలితాల సరళిని ఉద్దేశిస్తూ వివేక్‌ ఒబెరాయ్‌ చేసిన ఓ రీట్వీట్‌ సోషల్‌ మీడియాలో వివాదాస్పదంగా మారుతోంది. ఓ నెటిజన్‌ ముందస్తు ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి ఒక మీమ్‌ను తన ఖాతాలో పోస్ట్‌ చేయగా.. వివేక్‌ దాన్ని తన ట్విటర్‌లో రీ షేర్‌ చేశారు. ఇంతకీ ఆ ఫొటోల ఏముందంటే.. ఒపీనియన్‌ పోల్‌ అంటే సల్మాన్‌కు ఐశ్వర్యకు మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు.. ఎగ్జిట్‌ పోల్‌ అంటే తనతో ఐష్‌ చెట్టాపట్టాలేసుకోని తిరుగుతున్నట్లు.. చివరిగా ఫలితం మాత్రం ఐష్‌ అభిషేక్‌ను పెళ్లి చేసుకోని పిల్లాపాపలతో సంతోషంగా ఉందన్న అర్థం వచ్చేలా థీమ్‌ను చూపించారు. ఈ ఫొటోను తన ఖాతాలో రీట్వీట్‌ చేస్తూ.. ‘‘దీన్ని రాజకీయం చేయవద్దు.. జస్ట్‌ ఫర్‌ ఫన్‌’’ అని ట్వీటారు వివేక్‌. దీన్ని ఆయనలా నెట్టింట షేర్‌ చేశారో లేదో.. కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి విభిన్న రకాల కామెంట్లు వచ్చాయి. అయితే సోనమ్‌ కపూర్‌ మాత్రం ఈ పోస్ట్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘చాలా దారుణంగా ఉంది. లేకి తనానికి ప్రతీక ఇది’’ అని కామెంట్‌ పెట్టింది. ఇంతకీ ఇప్పుడీ ఫొటో మరీ అంతగా అందరి దృష్టినీ ఆకర్షించడానికి మరో కారణమేంటంటే.. ఐష్‌ వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉండటమే. ఎందుకంటే ఐష్‌ తొలినాళ్లలో సల్మాన్‌తో ప్రేమాయణం సాగించింది. కొన్నాళ్లకు వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత వివేక్‌ ఒబెరాయ్‌తో చెట్టాపట్టాలేసుకోని తిరిగింది. కానీ, చివరకు అభిషేక్‌ను పెళ్లి చేసుకొంది. ఈ పాయింట్‌ను ప్రస్తుత ఎగ్జిట్‌ పోల్స్‌ సరళికి తగ్గట్లుగా మీమ్‌లా తయారు చేసి చూపించడం సదరు వ్యక్తి క్రియేటివిటీకి అద్దం పట్టింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.