బాక్సాఫీస్‌ దగ్గర హృతిక్‌ - టైగర్ల ‘వార్‌’

ప్రముఖ బాలీవుడ్‌ నటులు హృతిక్‌ రోషన్‌ కలిసి నటించిన చిత్రం ‘వార్‌’. అక్టోబర్‌ 2 గాంధీ జయంతి రోజున విడుదలైన ఈ సినిమా ఒక్కరోజులోనే హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కలిపి యాభైమూడు కోట్లకు పైగా వసూళ్లు చేసింది. యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమైన సినిమాలో కథానాయికగా వాణీ కపూర్‌ నటించగా, అశుతోష్‌ రాణా, అనుప్రియ గోయెంకాలు కీలక పాత్రల్లో నటించారు. చిత్ర వసూళ్లపై దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ స్పందిస్తూ..‘‘మా ‘వార్‌’ చిత్రాన్ని పెద్దఎత్తున చూస్తున్న ప్రేక్షకులకు మేమంతో రుణపడి ఉన్నాం. మా శ్రమ ఊరికే పోలేదు అంటానికి ఫలితం.. బాక్సాఫీసు దగ్గర చిత్రం చేస్తున్న వసూళ్లు నిదర్శనం’’ అని చెబుతున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.