సన్నీలియోనీ, సల్మాన్‌ తర్వాత అమితాబ్, అక్షయ్‌
జాబితాలో బాలీవుడ్‌ అగ్ర కథానాయకులు అమితాబ్‌ బచ్చన్, అక్షయ్‌ కుమార్‌ని వెనక్కినెట్టి మొదటి స్థానంలో నిలిచారు సన్నీలియోనీ, సల్మాన్‌ ఖాన్‌. అదేంటంటే? ప్రముఖ సంస్థ యాహూ ప్రతి సంవత్సరం ఓ నివేదిక విడుదల చేస్తుంటుంది. ఇందులో నెట్టింట ఏ సెలబ్రిటీ గురించి ఎక్కువ మంది అన్వేషించారో తెలియజేస్తుంది. ‘యాహూ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ సెలబ్రిటీ’ పేరిట వాళ్ల వివరాలు ప్రకటిస్తుందనే విషయం తెలిసిందే. 2019గాను నటి సన్నీ లియోనీ, కండల వీరుడు సల్మాన్‌ మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది అత్యధిక మంది ఈ ఇద్దరి గురించి వెతికారట. వీళ్ల తర్వాతి స్థానంలో అమితాబ్‌ బచ్చన్, అక్షయ్‌ కుమార్‌ ఉన్నారు. 2016, 2017లోనూ సన్నీనే మొదటి స్థానంలో ఉంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.