సొంతంగా ఓటీటీ వేదికను ప్రారంభించనున్న యశ్‌ రాజ్‌ ఫిల్మ్ సంస్థ!

బాలీవుడ్‌లో ఎన్నో ప్రొడక్షన్‌ సంస్థలు ఉన్నాయి. వాటిలో పేరెన్నిగన్న సంస్థ యష్‌ రాజ్‌ ఫిల్మ్స్. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి సంస్థ స్థాపించి స్వర్ణోత్సవం (50) పూర్తి చేసుకుంటోంది. ఇప్పుడున్న బాలీవుడ్‌ అగ్రకథానాయకులైన సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, అజయ్‌ దేవగణ్‌, కత్రీనా కైఫ్‌,న దీపికా పదుకొణె తారలతో ఓ ఒప్పందం చేసుకోవడం కోసం చర్చలు జరిగాయట. వైఆర్‌ఎఫ్ నిర్మించిన కల్ట్ క్లాసిక్‌ల చిత్రాలను మరోసారి పున:పార్రంభించి మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చలనచిత్రోత్సవాన్ని నిర్వహించాలని ప్రణాళికలు చేస్తుంది. అంతేకాదు సొంతంగా డిజిటల్‌ వేదికను ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైఆర్‌ఎఫ్‌ సంస్థకు చెందిన చిత్రాల హక్కులన్నీ అమెజాన్‌ దగ్గర ఉన్నాయి. అయినా సరే యష్‌ సంస్థ సొంతంగా డిజిటల్‌ వేదికను ప్రారంభించి, నిబంధనలు, షరతుల ప్రకారం పనిచేయాలని చూస్తున్నారు. ఇలా సంస్థకు ఇది లైబ్రరీలా ఉపయోగపడటమే కాదు. ఎప్పటి నుంచో వైఆర్‌ఎఫ్‌ని అభిమానిస్తున్న ప్రేక్షకులకు అన్ని చిత్రాలను ఒక్క బటన్‌తో చూసేయవచ్చు. అంతేకాదు సొంతంగా యాక్టింగ్‌ స్కూల్‌ని సైతం ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఇలాంటి అన్ని విషయాలు తెలియాలంటే మాత్రం యష్‌ చోప్రా జయంతి సెప్టెంబర్‌ 27 వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం యష్‌ రాజ్‌ సంస్థ బంటీ ఔర్‌ బబ్లీ 2, షమ్‌షేరా, పృథ్వీరాజ్‌, సందీప్‌ ఔర్ పింకీ ఫరార్‌ లాంటి చిత్రాలను నిర్మిస్తోంది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.