హుషారు గీతాలకు పెట్టింది పేరు!

బాలీవుడ్‌లో కిషోర్‌కుమార్‌ది ఒక శకం. నేపథ్య గాయకుడిగా, నటుడిగా, గీత రచయితగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్కీన్ర్‌ప్లే రచయితగా బహుముఖమైన సృజనాత్మకతను చూపించిన దిగ్గజం. గాయకుడిగా అతడు చేసిన ప్రయోగాలు అద్భుతం. శ్రావ్యమైన పాటలే కాదు, ప్రేమగీతాలు, హుషారైన పాటలు ఏమైనా కిషోర్‌కుమార్‌ పాడిన శైలి ఎప్పుడూ ఓ ప్రత్యేకతను చూపించింది. హిందీ, బెంగాలీ, మరాఠీ, అసామీస్, గుజరాతీ, కన్నడ, భోజ్‌పురి, మలయాళం, ఉర్దూ భాషల్లో కూడా పాటలు పాడిన ఘనత అతడిది. బెంగాలీలో ఎన్నో ఆల్బమ్స్‌ను వెలువరించాడు. ఎనిమిది ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నాడు. మధ్యప్రదేశ్‌ ఆయన పేరిట ఓ అవార్డును ప్రవేశపెట్టింది. కిషోర్‌కుమార్‌ పాడి, విడుదల కాని ఒక ఆఖరిపాటకు 2012లో వేలం నిర్వహిస్తే అది 15.6 లక్షలకు అమ్ముడైంది. నటుడిగా కూడా ‘నౌకరి’, ‘బాప్‌రే బాప్‌’, ‘చల్తీ కా నామ్‌ గాడీ’, ‘హాఫ్‌ టికెట్‌’, ‘పడోసన్‌’లాంటి ఎన్నో హిట్‌ సినిమాలను అందించాడు. రుమ, మధుబాల, యోగితా బాలి, లీనా చంద్రవర్కర్‌లను పెళ్లి చేసుకున్నాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.