అలనాటి అందాల తార

ఒక అంతర్జాతీయ చిత్రోత్సవంలో అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా సుచిత్రా సేన్‌ గుర్తిండి పోతారు. బెంగాలీ, హిందీ సినిమాల్లో నటించిన ఈమె 1963లో మాస్కో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ నటిగా రజత పతకం అందుకున్నారు. ‘సప్తపది’ అనే సినిమాల్లో తాగుడుకు అలవాటు పడిన మహిళగా నటించిన ఆమె నటనకు లభించిన పురస్కారం అది. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్నారు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వచ్చినా ప్రచారం ఇష్టం లేని ఆమె దాన్ని సున్నితంగా తిరస్కరించారు. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఆమెను ‘బంగా భూషణ్‌’ అనే ప్రతిష్ఠాత్మక అవార్డుతో సత్కరించింది. బెంగాల్‌లో 1931 ఏప్రిల్‌ 6న పుట్టిన సుచిత్రాసేన్, అందాల అభినేత్రిగా పేరొందారు. ప్రముఖ బెంగాలీ నటి మూన్‌మూన్‌సేన్‌ ఈమె కుమార్తే. ఈమె తన 82వ ఏట 2014 జనవరి 17న కోల్‌కతాలో కన్నుమూశారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.