మూడు రంగాల నటుడు

నాటకం, రేడియో, సినిమా... ఈ మూడింటిపైనా నటుడిగా తనదైన ముద్ర వేశాడు ఓర్సన్‌ వెల్స్‌. గొప్ప సినిమాగా పేర్కొనే ‘సిటిజన్‌ కానే’ (1941)లో ఇతడి నటన అంతర్జాతీయ ప్రాచుర్యం పొందింది. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా పేరొందిన ఇతడు, ‘ద మాగ్నిఫిషెంట్‌ అంబర్‌సన్స్‌’, ‘ద లేడీ ఫ్రమ్‌ షాంగై’, ‘టచ్‌ ఆఫ్‌ ఈవిల్‌’, ‘ద ట్రయల్‌’, ‘ఖైమ్స్‌ ఎట్‌ మిడ్‌నైట్‌’, ‘ఎఫ్‌ ఫర్‌ ఫేక్‌’లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెరికాలో 1915 మే 6న పుట్టిన ఇతడు, నటుడిగా దర్శకుడిగా సేవలందించి 1985 అక్టోబర్‌ 10న తన 70వ ఏట కాలిఫోర్నియాలో మరణించాడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.