అందాల నటి


టిగా, డ్యాన్సర్‌గా, గాయనిగా పేరు తెచ్చుకున్న జింజర్‌ రోగర్స్‌ ఒకప్పుడు హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకోవడమే కాకుండా ఆస్కార్‌ అవార్డు గెలుచుకుంది. పద్నాలుగేళ్లకే డ్యాన్స్‌ పోటీల్లో గెలుపొంది ఎన్నో సంగీత రూపకాల్లో నర్తిస్తూ అనేక ప్రదర్శనలు ఇచ్చింది. ఆ ప్రాచుర్యంతో నాటకాలలో పాత్రలు ధరించింది. ఆమె ప్రతిభ గ్రహించిన ప్యారమౌంట్‌ పిక్చర్స్‌ చిత్రనిర్మాణ సంస్థ వెండితెరకు పరిచయం చేసింది. ‘ఫార్టీ సెకండ్‌ స్ట్రీట్‌’, ‘స్వింగ్‌ టైమ్‌’, ‘టాప్‌ హ్యాట్‌’, ‘కిట్టీ ఫాయ్‌లే’ లాంటి చిత్రాలతో ఉత్తమ నటిగా అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. వర్జీనియాలో 1911 జులై 16న పుట్టిన ఈమె, కాలిఫోర్నియాలో 1995 ఏప్రిల్‌ 25న మరణించింది.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.