అవార్డుల నటుడు

- బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి ‘సర్‌’ బిరుదు ప్రదానం...
- అత్యున్నతమైన ‘మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌’ పురస్కారం...
- ఆస్కార్, బాఫ్టా, గోల్డెన్‌గ్లోబ్, టోనీ అవార్డులను అందుకున్న అతి తక్కువ నటుల్లో స్థానం..


జీవిత సాఫల్య పురస్కారంగా ఆస్కార్‌ గౌరవం... ఇవన్నీ అందుకున్న అరుదైన నటుడు సర్‌ ఎలెక్‌ గిన్నెస్‌. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రాల్లో అతడు ధరించిన ఎన్నో పాత్రలు మరపురానివే. ‘ద లేడీ కిల్లర్స్‌’, ‘కైండ్‌ హార్టస్‌ అండ్‌ కొరొనెట్స్‌’, ‘గ్రేట్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌’, ‘ఆలివర్‌ ట్విస్ట్‌’, ‘ద బ్రిడ్జ్‌ ఆన్‌ ద రివర్‌ క్వాయ్‌’, ‘లారెన్స్‌ ఆఫ్‌ అరేబియా’, ‘డాక్టర్‌ జివాగో’, ‘ఎ పాసేజ్‌ టు ఇండియా’, ‘స్టార్‌వార్స్‌ ట్రయాలజీ’ సినిమాలు చూసిన వారికి ఆయన పాత్రలు గుర్తుండిపోతాయి. లండన్‌లో 1914 ఏప్రిల్‌ 2న పుట్టిన గిన్నెస్, థియేటర్‌ ఆర్ట్స్లో చేరి నాటకాల ద్వారా ఆకట్టుకున్నాడు. సినిమాల్లో మొదæ కొన్ని కామెడీ పాత్రలు ధరించినా క్రమంగా మంచి క్యారెక్టర్‌ నటుడిగా ఎదిగిన ఇతడు తన 86వ ఏట 2000 ఆగస్టు 5న ఇంగ్లండ్‌లో మరణించాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.