నట బాంధవుడు

బాలీవుడ్‌లో పృథ్వీరాజ్‌ కపూర్‌ కుటుంబంలాగే హాలీవుడ్‌లో కూడా బారీమోర్‌ అనే నట కుటుంబం ఉంది. ఆ నట కుటుంబంలో ఒకడు లియోనెల్‌ బారీమోర్‌. ఇతడు నటులు జార్జియానా డ్రూ బారీమోర్, మారైస్‌ బారీమోర్‌ల కుమారుడు. ఎథెల్‌ బారీమోర్, జాన్‌ బారీమోర్‌లకు అన్నయ్య. జాన్‌ డ్రూ బారీమోర్, డయానా బారీమోర్‌లకు మేనమామ. డ్రూ బారీమోర్‌ సహా మరికొందరికి పెద్ద మామయ్య. వీళ్లంతా నాటక రంగ, టీవీ, వెండితెర నటులే కావడం విశేషం. నటుడిగా, రేడియో కళాకారుడిగా, నాటకాల వేషధారుడిగా, సినిమా దర్శకుడిగా వ్యవహించిన లియోనెల్‌ బారీమోర్, ‘ఎ ఫ్రీ సోల్‌’ (1931) సినిమాకు ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నాడు. ‘ఇట్స్‌ ఎ వండర్‌ఫుల్‌ లైఫ్‌’, ‘డాక్టర్‌ కిడారే’ చిత్రాలు ఇతడికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చాయి. ఫిలడెల్ఫియాలో 1878 ఏప్రిల్‌ 28న పుట్టిన ఇతడు, నటనా ప్రస్థానంలో చెరగని ముద్ర వేసి, కాలిఫోర్నియాలో 1954 నవంబర్‌ 15న తన 76వ ఏట మరణించాడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.