మేటి చిత్రాల రూపశిల్పి
ఓ మంచి సినిమా చూస్తే ‘దర్శకుడు ఎవరు?’ అని తెలుసుకుని మరీ గుర్తు పెట్టుకుంటారు సినీ అభిమానులు. అలా ప్రపంచ వ్యాప్తంగా ఎందరికో మరుపురాని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు బెర్నార్డో బెట్రొలూసి. ఇటలీకి చెందిన ఈయన మంచి కవి కూడా. అందువల్లనేనేమో, అతడి సినిమాలు కూడా కవితాత్మకంగా, రంగుల స్వప్నంలాగా ఉంటాయని చెబుతుంటారు అతడి అభిమానులు. ఆ ప్రతిభ ఏంటో తెలియాలంటే అంతర్జాతీయంగా ఆకట్టుకున్న ‘లిటిల్‌ బుద్ధ’, ‘ద లాస్ట్‌ ఎంపరర్‌’, ‘ద కన్ఫర్మిస్ట్‌’, ‘లాస్ట్‌ ట్యాంగో ఇన్‌ ప్యారస్‌’, ‘ద షెల్టరింగ్‌ స్కై’, ‘స్టీలింగ్‌ బ్యూటీ’, ‘ద డ్రీమర్స్‌’ లాంటి సినిమాలు చూడాలి. రెండు ఆస్కార్‌ అవార్డులతో పాటు కేన్స్‌ చిత్రోత్సవంలో ప్రతిష్ఠాత్మకమైన ‘పామె డిఓర్‌’ పురస్కారాన్ని కూడా పొందిన ఈయన, ఇటలీలో 1941 మార్చి 16న పుట్టి రోమ్‌లో పట్టభద్రుడయ్యేసరికే కవిగా, రచయితగా పేరు తెచ్చుకున్నాడు. ఇరవై రెండేళ్లకే మెగాఫోన్‌ పట్టుకుని దర్శకుడిగా మారాడు. ప్రత్యేకమైన దర్శకత్వ శైలికి పేరు పడిన ఈయన తన 77వ ఏట 2018 నవంబర్‌ 26న మరణించారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.