బాక్సాఫీస్‌ స్టార్‌

రసగా అయిదేళ్ల పాటు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల నటుడిగా గుర్తింపు పొంది, ‘బాక్సాఫీసు స్టార్‌’ అనిపించుకున్నవాడతడు. అతడే బర్ట్‌ రేనాల్డ్స్‌. రేడియో, నాటక రంగాలతో పాటు అటు బుల్లితెర, ఇటు వెండితెరపై ఓ వెలుగు వెలిగాడు. అతడి విలక్షణమైన నటన తెలియాలంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘నవజో జోయ్‌’, ‘డెలివరెన్స్‌’, ‘ద లార్జెస్ట్‌ యార్డ్‌’, ‘స్మోకీ అండ్‌ ద బాండిట్‌’, ‘సెమీ టఫ్‌’, ‘ద ఎండ్‌’, ‘హూపర్‌’, ‘స్టారింగ్‌ ఓవర్‌’, ‘ద కేనన్‌బాల్‌ రన్‌’, ‘షార్కీస్‌ మెషీన్‌’, ‘ద బెస్ట్‌ లిటిల్‌ వోర్‌హౌస్‌ ఇన్‌ టెక్సాస్‌’లాంటి సినిమాలు చూడాలి. అమెరికాలో 1936 ఫిబ్రవరి 11న పుట్టిన ఇతడు, యువకుడిగా ఫుట్‌బాల్‌ క్రీడాకారుడిగా రాణించాడు. ఓ ప్రమాదంలో మోకాళ్లకు గాయాలు కావడంతో ఆటను వదులుకుని నటనవైపు దృష్టి సారించాడు. నాటకాలు, టీవీల ద్వారా సినిమాల్లోకి ప్రవేశించాడు. ఎన్నో అవార్డులు అందుకున్న ఇతడు ఫ్లోరిడాలో 2018 సెప్టెంబర్‌ 6న తన 82వ ఏట మరణించాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.