ఆరేళ్లకే అభినయం...

ఆ కుర్రాడు ఆరేళ్లకే అభినయ రంగంలో బుడిబుడి నడకలు మొదలు పెట్టాడు... పదహారేళ్ల కల్లా నాటకాల ద్వారా అనేక ప్రదర్శనలు ఇచ్చి మంచి నటుడిగా పేరు పొందాడు... ఆ తర్వాత వెండితెరపై అడుగు పెట్టి హాలీవుడ్‌ క్లాసిక్‌ సినిమాల్లో మేటి నటుడిగా రాణించాడు. అతడే క్యారీ గ్రాంట్‌. ‘షి డన్‌ హిమ్‌ రాంగ్‌’, ‘ద ఆఫుల్‌ ట్రూత్‌’, ‘బ్రింగింగ్‌ అప్‌ బేబీ’, ‘హిస్‌ గర్ల్‌ ఫ్రైడే’, ‘ద ఫిలడెల్ఫియా స్టోరీ’, ‘టు క్యాచ్‌ ఎ థీఫ్‌’, ‘ద ప్రైడ్‌ అండ్‌ ద ప్యాసన్‌’ లాంటి సినిమాల్లో మెప్పించాడు. ‘కింగ్‌ ఆప్‌ సస్పెన్స్‌’గా పేరొందిన ప్రముఖ దర్శకుడు ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ తీసిన ‘సస్పిషన్‌’, ‘నొటోరియస్‌’, ‘టు క్యాచ్‌ ఎ థీఫ్‌’, ‘నార్త్‌బై నార్త్‌ వెస్ట్‌’ సినిమాల ద్వారా అంతర్జాతీయ ప్రాచుర్యం పొందాడు. ఆస్కార్‌ గౌరవ పురస్కారంతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నాడు. అలనాటి మేటి నటుడిగా తనదైన ముద్ర వేసిన ఇతడు తన 82వ ఏట 1986 నవంబర్‌ 29న ఓ నాటకం కోసం రిహార్సల్స్‌లో పాల్గొంటూ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై కన్పుమూశాడు. Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.