‘బ్లాక్‌ పాంథర్‌’ నటుడు చాడ్విక్ కన్నుమూత

హాలీవుడ్ నటుడు నిర్మాత చాడ్విక్‌ ఆరోన్‌ బోస్మాన్‌ కన్నుమూశారు. గత కొంత క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన లాస్‌ఎంజెల్స్ లోని తన సృగృహంలోనే మరణించారు. ఆయన వయసు 43 సంవత్సరాలు. చాడ్విక్‌ 2016 నుంచి స్టేజ్‌ 3 పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 2016 సంవత్సరంలో వచ్చిన ‘కెప్టెన్‌ అమెరికా సివిల్‌వార్‌’ చిత్రంలో మార్వెల్‌ సూపర్‌ హీరో బ్లాక్‌ పాంథర్‌ పాత్రలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇక ఇదే బ్లాంక్ పాంథర్‌ పాత్రను గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఘనమైన వసూళ్లు సాధించిన ‘ఎవెంజర్స్: ది ఎండ్‌గేమ్‌’లోనూ పోషించారు. చాడ్విక్‌ 2008లో ‘ది ఎక్స్ ప్రెస్‌: ది ఎర్ని డేవిస్‌ స్టోరీ’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారు. ఆ తరువాత ‘ది కిల్‌ హోల్’‌, ‘42’, ‘డ్రాప్ట్ డే’ చిత్రాల్లో నటించారు. ఇక ‘గాడ్స్ ఆఫ్‌ ఈజిప్టు’ చిత్రంలో థోత్‌ ది గాడ్‌ ఆఫ్‌ విజ్డమ్‌ పాత్రలో అలరించారు. ఆ తరువాత ‘మెస్సేజ్‌ ఫ్రమ్‌ ది కింగ్’‌, ‘మార్షల్‌’, ‘బ్లాక్‌ ఫాంథర్’‌, ‘ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’‌ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక ఈ ఏడాది ఆరంభంలో ‘డా 5 బ్లడ్స్ ’లో నటించగా, ప్రస్తుతం ‘మా రైనేస్‌ బ్లాక్ బాటమ్’ అనే చిత్రంలో ట్రంపెటర్‌ లెవీగా నటించారు. చాడ్విక్‌ బాప్తిజం తీసుకున్నారు. చర్చి గాయక బృందంలో ఒకడిగా ఉన్నారు. చాడ్విక్‌ పూర్తి శాఖహారి. గత ఏడాది సింగ్‌ర్‌ టేలర్‌ సిమోన్‌ని నిశ్చితార్థం చేసుకొని తరువాత పెళ్లి చేసుకొన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.