సూపర్‌ ప్రమాదం!

గాలిలోకి రివ్వుమంటూ ఎగిరి ఆకట్టుకున్న సూపర్‌మ్యాన్‌... అంతరిక్షంలోకి సైతం దూసుకుపోగలిగే సూపర్‌మ్యాన్‌... అవసరమైతే భూమిని వెనక్కి తిప్పి గతాన్ని మళ్లీ రప్పించగలిగే సూపర్‌మ్యాన్‌... తన అపూర్వ శక్తులతో దుష్టుల పనిపట్టి అందరినీ కపాడిన సూపర్‌మ్యాన్‌... కేవలం మంచానికి మాత్రమే పరిమితమయ్యేలా మార్చేసిన రోజు ఇది. ‘సూపర్‌మ్యాన్‌’ పాత్ర ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క్రిస్టోఫర్‌ రీవ్, వర్జీనియాలో గుర్రపు పందాల్లో పాల్గొంటూ దురదృష్టవశాత్తూ 1995లో ఇదే రోజు పడిపోయి గాయపడ్డాడు. మెడ నుంచి శరీరం మొత్తం చచ్చుపడిపోయి కదలలేని స్థితికి వచ్చాడు. అయినా నిరాశ పడకుండా జీవితం పట్ల సానుకూల దృక్పథంతో చక్రాల కుర్చీ నుంచే పుస్తకాలు రాసి, సినిమాలు సైతం తీయగలగడం ద్వారా ‘నిజమైన సూపర్‌మ్యాన్‌’ అనిపించుకోగలడం విశేషం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.