సినిమాకు సొబగులు!

సినిమాకు ఆధునికతను సంతరించి కొత్త టెక్నిక్‌లను పరిచయం చేసిన వాడిగా డి.డబ్ల్యూ.గ్రిఫిత్‌ను గుర్తుంచుకోవాలి. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా ఆయన సినిమా చిత్రీకరణకు సంబంధించి లైటింగ్, కెమేరా యాంగిల్, క్లోజ్‌అప్స్, క్రాస్‌ కటింగ్, కంటిన్యుటీ ఎడిటింగ్, డోలీ షాట్స్‌... ఇలా ఎన్నో సాంకేతిక అంశాల్లో కొత్త ఒరవడిని సృష్టించాడు. ఆయన తీసిన ‘ద బర్త్‌ ఆఫ్‌ ఎ నేషన్‌’ (1915), ‘ఇన్‌టోలరెన్స్‌’ (1916) చిత్రాలను సినీ అభిమానులు ఈనాటికీ చెప్పుకుంటారు. యూఎస్‌లో 1875 జనవరి 22న పుట్టిన ఈయన ‘బ్రోకెన్‌ బ్లోజమ్స్‌’, ‘వే డౌన్‌ ఈస్ట్‌’, ‘ఆర్ఫన్స్‌ ఆఫ్‌ ద స్టార్మ్‌’, ‘ద స్టగ్రుల్‌’ లాంటి దాదాపు 500 సినిమాల ద్వారా ప్రపంచ గుర్తింపు పొందిన గ్రిఫిత్, అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ సైన్సెస్‌ స్థాపకుల్లో ఒకరు. సినిమాను పరిపుష్టం చేసిన వారిలో ఆద్యుడిగా పేర్కొనే ఈయన కాలిఫోర్నియాలో 1948 జులై 23న తన 73వ ఏట మరణించారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.