అటు గానం...ఇటు అభినయం...



గా
యనిగా, నటిగా యువతను మెప్పించిన నటి డయానా రాస్‌. ఆమె పాడిన గీతాలు, ఆల్బమ్‌లు, రికార్డులు ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా అమ్ముడుపోయాయి. గాయనిగా ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా యువత ఉర్రూతలూగేవారు. సినిమాల్లో మంచి అభినయం చూపి ఆస్కార్‌ కూడా అందుకుంది. ‘లేడీ సింగ్స్‌ ద బ్లూస్‌’, ‘మహోగనీ’, ‘ద విజ్‌’లాంటి సినిమాలతో అభిమానులను మెప్పించింది. టీవీ సినిమాల్లో కూడా ఇంటింటి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిచిగాన్‌లో 1944 మార్చి 26న పుట్టిన డయానా చిన్నతనంలోనే పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకుంది. సంగీత బృందాలతో కలిసి ప్రదర్శనలు ఇచ్చింది. టీవీల ద్వారా కూడా ప్రాచుర్యం సంపాదించింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.