ఆరు దశాబ్దాల ప్రయాణం

నటుడిగా అరవై ఏళ్ల పాటు అప్రతిహతంగా అలరించిన ఘనత ఎర్నెస్ట్‌ బొర్గ్‌నైన్‌కి చెందుతుంది. నాటకం, సినిమా, టీవీ రంగాల్లో దూసుకుపోయిన ఇతడు ఆస్కార్, ప్రైమ్‌టైమ్‌ ఎమ్మీలాంటి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. ‘చైనా కొర్సైర్‌’, ‘ఫ్రమ్‌ హియర్‌ టు ఎటర్నిటీ’, ‘వెరా క్రజ్‌’, ‘బ్యాడ్‌ డే ఎట్‌ బ్లాక్‌ రాక్‌’, ‘ద విండ్‌ బంచ్‌’, ‘మార్టీ’, ‘ఆల్‌ డాగ్స్‌ గోటు హెవెన్‌’లాంటి సినిమాల ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అమెరికాలో 1917 జనవరి 24న పుట్టిన ఇతడు, అమెరికా నావికా దళంలో సేవలందించి ఎన్నో పతకాలు పొందాడు. ఆ తర్వాత నాటక రంగంపై దృష్టి సారించాడు. బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేసిన ఇతడిని సినీరంగం సాదరంగా ఆహ్వానించింది. నటుడిగా ప్రశంసలు, పురస్కారాలు పొందిన ఇతడు, కాలిఫోర్నియాలో 2012 జులై 8న తన 95వ ఏట మరణించాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.