ఆస్కార్‌ అందుకున్న దర్శకుడు

ప్రపంచ సినీ అభిమానులెవరూ ‘మై ఫెయిర్‌ లేడీ’ చిత్రాన్ని మర్చిపోలేరు. దేశదేశాల్లో మేటి చిత్రంగా ప్రాచుర్యం పొందిన ఈ సినిమా ఆధారంగా ఎన్నో సినిమాలు రూపుదిద్దుకున్నాయి. ఆ సినిమాతో ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ అవార్డు అందుకున్న దర్శకుడు జార్జి కుకర్, మరెన్నో మేటి చిత్రాలను అందించాడు. ‘గాన్‌ విత్‌ ద విండ్‌’, ‘ద ఫిలడెల్ఫియా స్టోరీ’, ‘గ్యాస్‌లైట్‌’, ‘ఆడమ్స్‌ రిబ్‌’, ‘బోర్న్‌ ఎస్టర్‌డే’, ‘భొవాని జంక్షన్‌’, ‘వాట్‌ ప్రైస్‌ హాలీవుడ్‌’, ‘ఎ బాల్‌ ఆఫ్‌ డివోర్స్‌మెంట్‌’, ‘లిటిల్‌ ఉమెన్‌’, ‘డేవిడ్‌ కాపర్‌ఫీల్డ్‌’, ‘రోమియో అండ్‌ జూలియట్‌’, ‘ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌’లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. మన్‌హటన్‌లో 1899 జులై 7న పుట్టిన ఇతడు, చిన్నతనంలోనే నాటకాల్లో, నృత్య ప్రదర్శనల్లో చురుగ్గా పాలు పంచుకున్నాడు. ఆ ప్రతిభే అతడి సినీరంగ ప్రయాణానికి బాటలు పరిచింది. ఆస్కార్‌ సహా ఎన్నో అవార్డులు అందుకున్న ఇతడు, 1983 జనవరి 24న తన 83వ ఏట మరణించాడు.






Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.