హాలీవుడ్‌ స్వీటీ!
                             

హైస్కూలు చదువుతున్న ఓ అమ్మాయి కోక్‌ కొనడానికి ఓ దుకాణానికి వెళ్లింది. అక్కడ ఆమె అందాన్ని చూసి ఓ వ్యక్తి ఆమెను సినీరంగానికి పరిచయం చేశాడు. ఫలితంగా ఆమె ్ఞహాలీవుడ్‌ స్వీట్ఠీ, ్ఞగోల్డెన్‌ గర్ల్ఠ్‌ అనిపించుకునేంతగా ఎదిగింది. గ్లామర్‌కి చిరునామాగా పేరొందింది. ఆమే లానా టర్నర్‌. మోడలింగ్, రేడియో, నాటక రంగం, టెలివిజన్, సినీ రంగాల్లో అందాల తారగా ఆమె పేరు మార్మోగిపోయింది. అమెరికాలో అత్యధిక పారితోషికం అందుకునే తారగా వెలిగిపోయింది. పేదరికంలో పుట్టి తండ్రి మరణంతో అగచాట్లు పడుతూ పెరిగిన ఆమెకు అందమే వరమైంది. చూడగానే ఆకట్టుకునే ఆమె పదహారేళ్లకే వార్నర్‌ బ్రదర్స్, ఎమ్‌జీఎమ్‌ లాంటి చిత్ర నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని నటిగా మారింది. తొలిసినిమా ్ఞదే వోన్ట్‌ ఫర్గెట్ఠ్‌ ్బ1937్శతోనే అందంతో పాటు, అభినయంతో కూడా ఆకట్టుకుంది. ్ఞజానీ ఈగర్ఠ్, ్ఞజీగ్‌ఫీల్డ్‌ గర్ల్ఠ్, ్ఞడాక్టర్‌ జెకిల్‌ అండ్‌ మిస్టర్‌ హైడ్ఠ్, ్ఞసమ్‌వేర్‌ ఐ విల్‌ ఫైండ్‌ య్ఠు, ్ఞద పోస్ట్‌మ్యాన్‌ ఆల్వేజ్‌ రింగ్స్‌ ట్వైస్ఠ్, ్ఞద బ్యాడ్‌ అండ్‌ ద బ్యూటిఫుల్ఠ్, ్ఞపీటన్‌ ప్లేస్ఠ్, ్ఞఇమిటేషన్‌ ఆఫ్‌ లైఫ్ఠ్, ్ఞమేడమ్‌ ఎక్స్ఠ్‌లాంటి చిత్రాల ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను మెప్పించింది. అమెరికాలో 1921 ఫిబ్రవరి 8న పుట్టిన ఈమె, 1995 జూన్‌ 29న కాలిఫోర్నియాలో తన 74వ ఏట క్యాన్సర్‌తో మరణించింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.