రెండు ఆస్కార్ల ఉత్తమ నటుడు

నిమిది ఆస్కార్‌ నామినేషన్లు... రెండు ఆస్కార్‌ అవార్డులు... 60 సినిమాల్లో విలక్షణ పాత్రలు... ఇవీ జాక్‌ లెమ్మన్‌ నటనా ప్రస్థానానికి గీటురాళ్లు. ఎనిమిదేళ్ల వయసులోనే నటుడవ్వాలని కోరుకున్న ఇతడు అనుకున్నట్టే అభినయ రంగంలోకి ప్రవేశించి ప్రేక్షకులకు అభిమాన పాత్రుడయ్యాడు. ‘మిస్టర్‌ రాబర్ట్స్‌’ సినిమాతో ఉత్తమ సహాయ నటుడిగాను, ‘సేవ్‌ ద టైగర్‌’ సినిమాతో ఉత్తమ నటుడిగాను ఆస్కార్‌ అవార్డులు అందుకున్నాడు. ‘సమ్‌ లైకిట్‌ హాట్‌’, ‘ద అపార్ట్‌మెంట్‌’, ‘డేస్‌ ఆఫ్‌ వైన్‌ అండ్‌ రోజెస్‌’, ‘ద గ్రేట్‌ రేస్‌’, ‘ద ఆడ్‌ కపుల్‌’, ‘ద చైనా సిండ్రోమ్‌’, ‘మిస్సింగ్‌’, ‘గ్రెంగర్రీ గ్లెన్‌ రాస్‌’ లాంటి చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. అమెరికాలో 1925 ఫిబ్రవరి 8న పుట్టిన ఇతడు, స్కూలు రోజుల్లోనే నాటకాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడు. రేడియో, నాటకం, టీవీ, సినీ రంగాల్లో చురుగ్గా నటించిన ఇతడు ఎన్నో జీవనసాఫల్య పురస్కారాలు పొందాడు. ఏ పాత్ర ధరించినా తనదైన ముద్ర వేసిన ఇతడు 2001 జూన్‌ 27న తన 76వ ఏట కాలిఫోర్నియాలో మరణించాడు.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.