అరవై ఏళ్ల నటనా ప్రస్థానం
కామెడీ... రొమాన్స్‌... విలన్‌... యాంటీ హీరో... ఇలా రకరకాల పాత్రల్లో 60 ఏళ్ల పాటు మెప్పించిన నటుడు జాక్‌ నికల్సన్‌. ఇతడి వివరాలు చూస్తే ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి.


-ఆస్కార్‌ అవార్డుల చరిత్రలో అత్యధిక నామినేషన్లు పొందిన నటుడు
-ఉత్తమ నటుడిగా రెండుసార్లు, ఉత్తమ సహాయ నటుడిగా ఒక సారి ఆస్కార్‌ అవార్డులు
-మూడు ఆస్కార్‌లు పొందిన పురుషులు ముగ్గురే ఉంటే, వారిలో ఒకడు
-1960 నుంచి 2000 సంవత్సరాల మధ్య కాలంలో ప్రతి దశాబ్దంలోనూ ఆస్కార్‌ నామినేషన్లు పొందిన నటులు ఇద్దరే ఉంటే, వారిలో ఒకడు
-ఆరు గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు అందుకున్నాడు
-కెనడీ సెంటర్‌ పురస్కారం పొందాడు
-అమెరికన్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి జీవన సాఫల్య అవార్డు అందుకున్న వారిలో పిన్న వయస్కుడు (57 ఏళ్లకి)

అతడు నటించిన సినిమాల్లో... ‘బ్యాట్‌మ్యాన్‌’, ‘మార్స్‌ ఎటాక్స్‌’, ‘యాంగర్‌ మేనేజ్‌మెంట్‌’, ‘ఈజీ రైడర్‌’, ‘ఫైవ్‌ ఈజీ పీసెస్‌’, ‘వన్‌ ఫ్ల్యూ ఓవర్‌ ద కుకూస్‌ నెస్ట్‌’, ‘ద టూ జేక్స్‌’ లాంటి సినిమాలున్నాయి.న్యూజెర్సీలో 1937 ఏప్రిల్‌ 22న పుట్టిన ఇతడు చదువు పూర్తికాగానే నటుడిగా మారాలని నిర్ణయించుకుని నాటకాలు, టీవీల ద్వారా పేరు తెచ్చుకుని వెండితెరకు పరిచయమయ్యాడు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.