ఎక్స్‌ట్రా వేషాల నుంచి ఆస్కార్ల దాకా!

ఆమె సినిమాల్లో ఎక్స్‌ట్రా వేషాలతో నటనా ప్రస్థానం మొదలు పెట్టింది. అదీ నిశ్శబ్ద చిత్రాల్లో. తర్వాత బాక్సాఫీస్‌ తారగా మెరిసింది. అభినయంతో ఆకట్టుకుంది. ఒకే ఏడాది తీసిన మూడు సినిమాల్లో ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకున్న నటిగా రికార్డు సృష్టించింది. ఆమే జానెట్‌ గేనర్‌. 1929లో ‘సెవెంత్‌ హెవెన్‌’, ‘సన్‌రైజ్‌: ఎ సాంగ్‌ ఆఫ్‌ టు హ్యూమన్స్‌’, ‘స్ట్రీట్‌ ఏంజెల్‌’ సినిమాల్లో అభినయానికి ఆస్కార్‌ గెలుచుకుంది. ఆస్కార్‌ అవార్డుల చరిత్రలో మూడు చిత్రాల్లో పాత్రలకు గాను ఉత్తమ నటి అవార్డు ఇచ్చిన సందర్భం ఇదొక్కటే. పైగా ఇది ఆస్కార్‌ తొలి వేడుకలో వచ్చిన అవార్డు కావడం విశేషం. శబ్ద చిత్రాల్లో కూడా ఆమె హవా కొనసాగింది. తర్వాత టీవీ, నాటక రంగాల్లో కొనసాగింది. 1906 అక్టోబర్‌6న పుట్టిన ఈ సంచలన తార, 1984 సెప్టెంబర్‌ 14న ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించడం విషాదం



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.